ఆయన మార్గంలో పయనించాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
సేవాలాల్ చిత్రపటానికి నివాళి అర్పించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, గిరిజన నేతలు
లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 15: ఇప్పటి గిరిజన తండాలు ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా..?!దుర్వ్యసనాలు, దుర్గుణాలు, అరాచకాలు, అనాగకరికం, పేదరికం. అక్కడి ప్రజల్లో ఇవన్నీ సర్వసాధారణంగా కనిపించేవి. తన జాతి యావత్తు ఇలా దీన-హీన స్థితిలో ఉండడాన్ని సేవాలాల్ మహారాజ్ భరించలేకపోయాడు. ఆయన మనసు కలిచివేసింది. మూగగా రోదించింది. ఆ వేదన-రోదన నుంచి ఆలోచన పుట్టుకొచ్చింది. ఆచరణగా రూపుదాల్చింది. తన జాతి జనుల్లో మార్పు మొదలైంది. అది క్రమ క్రమంగా తండాల తల రాతను మార్చేసింది. తమకు బతుకును నేర్పిన, భవితను ఇచ్చిన సేవాలాల్ మహారాజ్‌ను దైవాంశ సంభూతిడిగా ఆ గిరిజన జాతి కొలువసాగింది. ఆయన 283వ జయంతి వేడుకను మంగళవారం పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
మండలంలోని బోరింగ్‌తండా గ్రామంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వనమా రామకృష్ణ, కొత్వాల శ్రీనివాసరావు, ఊకంటి గోపాలరావు, భూక్యా సోనా, భూక్యా రాంబాబు, మండె వీరహన్మంతరావు, కూచిపూడి జగన్, కొట్టి వెంకటేశ్వర్లు, జక్కుల సుందర్, వెంకటేశ్వర్లు, లాలు, బలరాం, కిషన్, లగడపాటి రమేష్ పాల్గొన్నారు.
చుంచుపల్లి, ఫిబ్రవరి 15: మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో డాక్టర్ రవిబాబు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ భీమానాయక్, ఎంపీపీ బదావత్ శాంతి, సర్పంచ్ మాలోత్ మహాలక్ష్మి, ఎస్సైలు మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం కల్చరల్, ఫిబ్రవరి 15: చుంచుపల్లి తండాలో జరిగిన వేడుకలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్, జిల్లా ఇన్చార్జి గందం మల్లికార్జున్‌రావు, నాయకులు సాయి, కల్యాణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 15: మండలంలోని జగన్నాథపురం, పాల్వంచ పట్టణంలో జరిగిన వేడుకల్లో శివసత్తుల సేవాసమితి వ్యవస్థాపక అద్యక్షుడు బాబూరావు, జగన్నాథపురం సర్పంచ్ అనితాబాలాజీ, నాయకులు కోటేశ్వరి, నందానాయక్, బిచ్చానాయక్, సేవ్యా, సీతారాం సాధు, రమేష్, శంకర్, లలిత, దుర్గాప్రసాద్, సక్రు, పవన్‌తేజ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 15: కొత్తగూడెం రైటర్ బస్తీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ‘దిశ’ సభ్యుడు కొదమసింహం పాండురంగాచార్యులు ఆధ్వర్యాన జరిగిన వేడుకలో మహ్మద్ రియాజ్, పవన్ కల్యాణ్, కల్లూరి కృష్ణ, యాదగిరి, సంధ్య, శిరీష, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.