కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలో ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. త్వరలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
కార్యకర్తలే పార్టీకి బలమని టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తనపై నమ్మకంతో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు శాయశక్తులా కృషి చేసి తగిన న్యాయం చేస్తానని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ను గెలుపించుకునేందుకు కృషి చేస్తానన్నారు. కొత్తగూడెంలో ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయన్నారు. త్వరలో కొత్తగూడెం పట్టణ కమిటీని నియమిస్తామన్నారు.