ఇల్లెందు/ మణుగూరు టౌన్/ దమ్మపేట/ అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 4 : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీల్లో నాయకుల పోకడలు, విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో బీఆర్ఎస్ బాట పడుతున్నారు. గురువారం మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో దమ్మక్కపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మడి గౌతమితోపాటు ఎనిమిది మంది వార్డు అభ్యర్థులు కారం పద్మ, మడి సుధారాణి, కాక సంధ్య, బొగ్గు లక్ష్మి, కణితి అలివేలు, మడి లక్ష్మి, మడి నాగలక్ష్మి, గుండి సతీశ్, రావులపల్లి నాగేశ్వరరావులతోపాటు దమ్మక్కపేట గ్రామస్తులు మడి మల్లయ్య, మడి సీతమ్మ, బట్ట సాంబయ్య, కంటి అలివేలు, కలిపి జానకిరావు, కాక కీర్తి, మడి సందీప్‌కుమార్, అభిలాష్, రామారావు, పాముల అనూష, లక్ష్మణ్‌లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇల్లెందు మండలం రొంపేడుకు చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్ తన అనుచరులు, 50 కుటుంబాలతో కలిసి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా బావ్‌సింగ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియానాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆదివాసీ గిరిజన నాయకుడు, ప్రముఖ న్యాయవాది సువర్ణపాక సత్యనారాయణతోపాటు పూసపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలకు చెందిన వారు తిలక్‌నగర్ పంచాయతీ పరిధి ఆలీబాబా దర్గా వద్ద బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్‌కుమార్, కార్యదర్శి రాజేశ్వరిల ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అనంతరం తిలక్‌నగర్ సర్పంచ్ అభ్యర్థిగా సువర్ణపాక సత్యనారాయణను ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలో చేరిన వారిలో అజ్మీరా జోగ్య, మూడ్ బలరాం, శారద, వాంకుడోత్ రవి, అజ్మీరా రవి, కిరణ్, పద్మ, ధర్మసోత్ లక్ష్మి, శిరీష, మారి, భద్రి, కల్తీ వినోద్, తాటి బాస్, వెంకటేష్, రాంబాబు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ పోచం నరసింహారావు, కొట్టం రాంబాబు, రామదాని వెంకటరెడ్డి, ఉపక సత్యనారాయణ, అజ్మీరా రాంబాబు, మూడ్ హనుమాన్, గుగులోత్ సోమన్న, అబ్దుల్ జబ్బార్, అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు. దమ్మపేటకు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన పది కుటుంబాలు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన పెనుబల్లి లక్ష్మి, డొక్కా ప్రకాశ్, జుజ్జూరి ముత్తేశ్వరి, చంద్రకళ, కుమారి, నాగరాజు, నాగుల రాజు, దివ్య, వెంకాయమ్మలకు మెచ్చా పూలమాలలు వేసి స్వాగతించారు. పంచాయతీ ఎన్నికల ఇన్చార్జి, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దారా యుగంధర్, అబ్దుల్ జిన్నా, గాజుబోయిన ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెంకు చెందిన ఐదు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి పార్టీ మండల అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్నబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
మాజీ సర్పంచ్ యాట్ట మహేశ్వరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బైటా ధర్మరావు ఆధ్వర్యంలో కొండ్రు సత్యనారాయణ, కొండ్రు వెంకటకృష్ణ, బొల్లు నాగరెడ్డి, బొల్లు రమేశ్, బొల్లు జయపాల్రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉమ్మల బాబురెడ్డి, ఉమ్మల శ్రీనివాసరెడ్డి, గంధం నీలారెడ్డి, ఉమ్మల కలెక్టర్రెడ్డి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రేగా కాంతారావు, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, దిండిగాల, టీబీజీకేఎస్ నాయకుడు ఎస్.రంగనాథ్‌లు మాట్లాడారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.