
చింతకాని, సెప్టెంబర్ 30: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయని, దళితబంధు ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. గురువారం మండలంలోని బోప్పారం గ్రామంలో పలు పార్టీలకు చెందిన 30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. వీరికి జడ్పీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వైపు పరుగులు పెడుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ పథకాలు, సంక్షేమం చూసి తట్టుకోలేక అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మోసపూరిత మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. భవిష్యత్లో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల, గ్రామశాఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, దళిత నాయకులు, దళితులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిక
మండలంలోని ఏదులాపురం గ్రామంలో సీపీఐ, సీపీఎం, టీడీపీకి చెందిన పలు కుటుంబాలు గురువారం టీఆర్ఎస్లో చేరాయి. టీఆర్ఎస్ నాయకులు వెంపటి రవి, షేక్ మైబెల్లిసాబ్ సమక్షంలో గ్రామానికి చెందిన చెరుకుపల్లి కృష్ణ, మంగమ్మ, యాకుబ్, నాగబాబు, నారపాటి మురళి, వెంకటేశ్వర్లు, మల్లయ్య, నారపాటి నాగరాజు, నారపాటి అశోక్, చెరుకుపల్లి సునీల్, ఉపేందర్, శారద, పావని, పొన్నెకంటి పద్మ, ఉండేటి కమలమ్మ, ఏర్పుల అలివేలు, గరిక వెంకటనారాయణ, పడిశాల వీరస్వామి, టేకుమట్ల కళమ్మ కుటుంబాలు టీఆర్ఎస్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు నారపాటి రమేశ్ ఆధ్వర్యంలో చేరారు. వీరికి రవి, మైబెల్లి పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించి మాట్లాడారు. వండ్లకుండ భుజంగరావు, తమ్మరబోయిన ఫణికుమార్, టేకుమట్ల వీరభద్రం, కోయిల యాకయ్య, మిర్యాల నరుణ్తేజ్, నరేష్, బంక మధు పాల్గొన్నారు.