కేఎల్‌యూ డైరెక్టర్ (అడ్మిషన్స్) శ్రీనివాసరావు
నమస్తే తెలంగాణ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సదస్సు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 14: కృషి, పట్టుదలతో ఓ ప్రణాళికను రూపొందించుకొని చదివితే ఇంజినీరింగ్‌లో సత్తా చాటి రూ.లక్షల్లో వేతనాలు పొందేలా విజయాలు సాధించవచ్చునని ఖమ్మం జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ‘నమస్తే తెలంగాణ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్’ సోమవారం సంయుక్తంగా అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థుల జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అని, ఆ తర్వాత ఎంపిక చేసుకునే కోర్సుల్లో తల్లిదండ్రుల ప్రమేయం తక్కువగా ఉంటుందని అన్నారు. మనం నిర్దేశించుకునే లక్ష్యాలకు అనుగుణంగానే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే జరిగే పరిణామాలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇంటర్ , డిగ్రీ తర్వాత ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులకు వివరించారు. ఆసక్తి ఉన్న కోర్సుల్లో రాణించి సాధారణ డిగ్రీతో సైతం సివిల్స్ సాధించిన వారు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బీఎం రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, కేఎల్‌యూ ఖమ్మం జోన్ రీజినల్ మేనేజర్ వీ స్వామిరెడ్డి, నమస్తే తెలంగాణ ప్రతినిధులు, శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. లక్కీడ్రాలో ఎంపికైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఇండస్ట్రీ-4దే భవిష్యత్..
నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచ పారిశ్రామిక రూపురేఖలను వేగంగా మార్చేస్తోంది. 2000వ సంవత్సరం నుంచి ఉద్యోగ అవకాశాల్లో ఇండస్ట్రీ-4 కీలకంగా మారింది. కొత్త కోర్సులతో రూ.లక్షల్లో వేతనాలు రానున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాలిటీ, బ్లాక్‌చైన్, ఫుల్సాక్ట్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడం వల్ల పరిశ్రమల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇండస్ట్రీ-4 టెక్నాలజీలో ప్రపంచ వ్యాప్తంగా 13.30 కోట్ల ఉద్యోగాలు రానున్నాయి.
–డాక్టర్ షణ్ముఖ్, ప్రొఫెసర్, కేఎల్ యూనివర్సిటీ
మా విద్యార్థులు రూ.52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు
ఇంజినీరింగ్‌కు అద్భుత భవిష్యత్ ఉంది. కాలేజీ ఎంపికతోనే కొలువుల మార్గం ఏర్పడుతుంది. చాలా మంది విద్యార్థులు నైపుణ్యాలు లేకపోవడం వల్లనే జీవితంలో రాణించలేకపోతున్నారు. 70 శాతం మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ప్రోగ్రాం వల్ల ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తోంది. పీహెచ్‌డీలు చేసి రీసెర్చ్ అనుభవం కలిగిన అధ్యాపకులతో బోధన చేయిస్తున్నాం. అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన సాఫ్ట్వేర్ సంస్థలో రూ.52 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించడం కేఎల్ యూనివర్సిటీకే సాధ్యమైంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో వంటి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన ఎక్స్‌లెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నాం. విద్యార్థులకు మెరిట్ టెస్టులు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి 10 శాతం నుంచి 100 శాతం వరకు ఫీజు రాయితీ కల్పిస్తున్నాం.
–డాక్టర్ జే.శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ
ఇది మంచి కార్యక్రమం..
ఇంటర్ తర్వాత ఉన్నత విద్యపై గల అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ – కేఎల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం చాలా మంచి కార్యక్రమం. కేఎల్ యూనివర్సిటీ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పరీక్షలో ఖమ్మంలోని శ్రీచైతన్య విద్యార్థులు టాప్ టెన్లోపు మూడు ర్యాంకులు సాధించారు. నాణ్యమైన విద్యను అందించడంతో శ్రీచైతన్య విద్యాసంస్థలు ముందుంటాయి.
–గోపాలకృష్ణ, ఏజీఎం, శ్రీచైతన్య విద్యాసంస్థలు
అవగాహన వచ్చింది..
ఇంటర్ తర్వాత ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలనే విషయంపై ఈ సదస్సుతో అవగాహన వచ్చింది. పట్టుదలతో చదివితే కొలువులు సాధించడం సులువని కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రపంచంలో రాబోతున్న మార్పులు, వాటికి అనుగుణంగా ఎలా సన్నద్ధం కావాలనే అంశాల గురించి ఇండస్ట్రీ-4లో తెలుసుకోగలిగాం. ఈ సదస్సు వల్ల నాలాంటి విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కలిగింది.
–దూదెకుల అమూల్య, విద్యార్థిని, ఖమ్మం