ఖమ్మం/మామిళ్లగూడెం, సెప్టెంబర్ 17: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని పటేల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాట్లను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, పోతీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ శనివారం పరిశీలించారు. ప్రముఖ కళాకారుల కార్యక్రమాలతోపాటు పిల్లల డ్యాన్స్‌లు ఉంటాయన్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు.