వైరా, ఫిబ్రవరి 21 : తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ప్రతి పేదింటి తెలంగాణ బిడ్డ ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. తహసీల్దార్ సైదులు అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొణిజర్ల, సింగరేణి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను వారు సోమవారం పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలు తల్లిదండ్రులకు భారం కాకూడదని తానే మేనమామగా మారి లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ కవిత, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్‌చైర్మన్ ముళ్లపాటి సీతరాములు, ఏఎంసీ చైర్మన్ బీ.డీ.కే.రత్నం, పీఏసీఎస్ చైర్మన్ చెరుకుమల్లి రవి, మౌలానా, దార్న రాజశేఖర్, బాణాల వెంకటేశ్వరరావు, తోటకూరి రాంబాబు, బండారు కృష్ణ, పోట్ల శ్రీనివాసరావు, కోసూరి శ్రీనివాసరావు, పసుపులేటి మోహన్‌రావు, కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, చల్లా మోహన్‌రావు, డేరంగుల బ్రహ్మం, ప్రసాద్, మిట్టపల్లి నాగేశ్వరరావు, మచ్చా బుజ్జి, ఇమ్మడి తిరుపతిరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.