
బోనకల్లు, సెప్టెంబర్ 7 : మండలంలో టీఆర్ఎస్ గ్రామకమిటీల ఎన్నిక పూర్తయింది. మండలంలో 22 గ్రామపంచాయతీలకు గాను గ్రామసభలు నిర్వహించి 22 టీఆర్ఎస్ గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం జానకీపురం టీఆర్ఎస్ గ్రామఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బొమ్మనబోయిన చంద్రం, గంగాధర భూపతి, బ్రాహ్మణపల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వంగల కృష్ణ, చేపూరి వెంకటనారాయణల ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేమూరి ప్రసాద్, మాజీ జడ్పీటీసీ బాణోతు కొండ, మండల నాయకులు కాకాని శ్రీనివాసరావు, గాదె నరోత్తంరెడ్డి, జానకీపురం గ్రామసర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జెర్రిపోతుల రవి, జానకీపురం రైతుబంధు కోఆర్డినేటర్ తోటకూర ఆనందరామయ్య, బ్రాహ్మణపల్లి రైతుబంధు కోఆర్డినేటర్ జంగా హల్లప్ప, రామిశెట్టి రవి, గాలి కోటయ్య పాల్గొన్నారు.
మధిరలో వార్డు కమిటీలు..
మధిరరూరల్, సెప్టెంబర్ 7 : మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల టీఆర్ఎస్ వార్డుకమిటీలను మంగళవారం ఎన్నుకున్నారు. 17వ వార్డు అధ్యక్ష, కార్యదర్శులుగా దొప్పా రామకృష్ణ, మల్లెల దుర్గయ్య, 18వ వార్డు అధ్యక్ష, కార్యదర్శులుగా కప్పగంతుల పట్టాభిరామశర్మ, కన్నీదార చంద్రశేఖర్, 11వ వార్డు అధ్యక్ష, కార్యదర్శులుగా గద్దల స్వామి, రెడపంగి కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా దుబాసి బుజ్జిబాబు, గద్దల యేసు, కోశాధికారిగా చింతల కిరణ్, రావూరి వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. అదేవిధంగా మహిళా కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, యూత్ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వార్డుకౌన్సిలర్లు గద్దల మాధురి, అరిగె రజిని, తెరాస పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మొండితోక జయాకర్, పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వరరావు, దొడ్డా మురళీ, బత్తుల శ్రీనివాసరావు, వల్లిశెట్టి శ్రీనివాసరావు, ఫ్లోర్‌లీడర్ అప్పారావు, మైల రాము, తరుణ్, పద్మ, వెంకటరత్నం, ప్రశాంతి, మంగమ్మ పాల్గొన్నారు.
ఖమ్మంపాడు గ్రామకమిటీ ఎన్నిక..
మండల పరిధిలోని ఖమ్మంపాడు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా నూకవరపు అప్పారావు, కార్యదర్శిగా మర్శకట్ల శ్రీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, వైస్‌ఎంపీపీ సామినేని సురేశ్, టీఆర్ఎస్ నాయకులు పిడికిడి సాంబశివరావు, పుచ్చకాయల సీతరామయ్య, వెంకటరమణ, కొమ్మినేని రాంబాబు, సామినేని రత్తయ్యలు పాల్గొన్నారు.
పెద్దగోపవరంలో..
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 7 : మండలంలోని పెద్దగోపవరం టీఆర్ఎస్ గ్రామకమిటీని మంగళవారం సర్పంచ్ ఇనుపనూరి శివాజీ, ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్‌బాబు, ఉపసర్పంచ్ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శిగా ఇనుపనూరి దానకుమార్, ఉపాధ్యక్షునిగా మోదుగుల లక్ష్మయ్య, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదేవిధంగా ఎస్సీ, మహిళా అనుబంధ శాఖలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇనుపనూరి భాస్కర్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.