
సత్తుపల్లి రూరల్, ఆగస్టు 31 : టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబరు 2న నిర్వహించే జెండా పండుగను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నేత, రైతుబంధు సమితి కన్వీనర్ గాదె సత్యం పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వార్డుల్లో జెండా పండుగను కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కొత్తూరు ప్రభాకర్‌రావు, బెల్లంకొండ రాము, తడికమళ్ల ప్రకాశ్‌రావు, చల్లగుళ్ల నర్సింహారావు, రూత్ క్రిష్టియానా, వల్లభనేని పవన్, అమరవరపు కృష్ణారావు, రంగారావు, రఫీ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కల్లూరు, ఆగస్టు 31 : టీఆర్ఎస్ జెండా పండుగను నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల ఆదేశాల మేరకు మంగళవారం కల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబరు 2న మండల కేంద్రంతో పాటు అన్ని పంచాయతీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. సమావేశంలో కట్టా అజయ్‌బాబు, కొరకొప్పు ప్రసాద్, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, ఇస్మాయిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జెండా పండుగను ప్రతి గ్రామం లో ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సురేశ్‌నాయక్ అన్నారు. మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బానోతు సురేశ్‌నాయక్, భూక్యా లాలునాయక్, చందులాల్‌నాయక్, పూర్ణకంటి మైసారావు, శోభన్‌నాయక్, బానోతు రామారావు, మాళోతు బామ్నా, చందమామ నరసింహారావు, ఇసనపల్లి నాగేశ్వరరావు, కిషన్, సీతారాములు, సాయిలి నాగయ్య, బాజీ, అంజన్‌కుమార్, నాగయ్య, దూద్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ నాయ కత్వంలో మున్సి పాలిటీతో పాటు, అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దార్న రాజశేఖర్, మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య, వేల్పుల పావని, నం బూరి కనకదుర్గ, ముళ్లపాటి సీతారాములు, కాపా మురళీకృష్ణ, మిట్టపల్లి నాగి, బీడీకే రత్నం, ఎనుగంటి కృష్ణ, శాఖమూరి లోకేశ్వరరావు, ఇమ్మడి రామారావు, మాదినేని సునీత, గుగులోతు లక్ష్మీబాయి, రాయల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదేశాల మేరకు తల్లాడ గ్రామ పంచాయతీల్లో సెప్టెంబర్ 2న గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్డా శ్రీనివాసరావు, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భధ్రరాజు, శీలం కోటారెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, వజ్రాల రామిరెడ్డి, దిరిశాల దాసురావు, ఆదూరి వెంకటేశ్వర్లు, పెరక చిన్నబ్బాయి. గుంట్ల వెకంటేశ్వర్లు, మువ్వా మురళి, వెంకటేశ్వర్లు, పలువురు సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.