సత్తుపల్లి, సెప్టెంబర్ 9 : రాజీవ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. రుద్రాక్షపల్లి పంచాయతీలో గిరిజన గ్రామమైన సత్యంపేటలో కొలువుదీరిన గణపతి మండపం వద్ద అన్నదానాన్ని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, వీరపనేని బాబి, పెద్దిరాజు, సురేశ్, రఫీ, అమరవరపు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వాసవీక్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం ప్రారంభించారు.
కొణిజర్ల, సెప్టెంబర్ 9 : లాలాపురం కోదండ రామాలయ ప్రాంగణంలో శుక్రవారం మహాఅన్నదాన కార్యక్రమాన్ని బిలీఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మేడెంపుడి రమాజ్యోతి ప్రారంభించారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అన్నారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో దామా వీరయ్య, దామా వెంకటేశ్వర్లు, నామా రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. బస్వాపురం గ్రామంలో గణేశ్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు గుమ్మా రోశయ్య, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, కొరిన్ని బాబు, చల్లా బాబు, నల్లమోతు లక్ష్మయ్య, పెనుగొండ నాగభూషణం, సైదులు, పొనుగంటి వెంకయ్య, నల్లమోతు సైదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తల్లాడ, సెప్టెంబర్ 9 : అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎస్సై పీ సురేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్త మిట్టపల్లిలో వినాయక మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.
కల్లూరు రూరల్, సెప్టెంబర్ 9 : తొమ్మిదిరోజులుగా భక్తులచే పూజలు అందుకున్న గణనాథులకు శుక్రవారం మండల వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఏసీపీ వెంకటేశ్, ఎస్సై వెంకటేశ్‌లను నాయకులు సన్మానించారు. రఘునాధబంజరలో గణేశ్ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఎస్సై వెంకటేశ్ ప్రారంభించారు. ఎంపీపీ బీరవల్లి రఘు, సర్పంచ్ అంజన్‌రావు, ఉపసర్పంచ్ వెంకటేశ్వరరావు, నిర్వాహకుడు శీలం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
కల్లూరు, సెప్టెంబర్ 8 : గణనాథుల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై వెంకటేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నిమజ్జన సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.