ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
తొలిరోజు అన్నదానాలు,పండ్లు, దుప్పట్లు పంపిణీ
అనాథ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు
నేడు రక్తదాన శిబిరాల ఏర్పాటు
మంత్రి కేటీఆర్ పిలుపుతో ఉత్సాహంగా పాల్గొంటున్న టీఆర్ఎస్ శ్రేణులు
ఖమ్మం, ఫిబ్రవరి 15: ఉక్కు సంకల్పి.. ఎత్తిన జెండా దించని యోధుడు.. 60 ఏండ్ల కలను సాకారం చేసిన స్వాప్నికుడు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు.. అభివృద్ధి ప్రదాత సీఎం కే.చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న పుట్టినరోజు కాగా, మూడు రోజులపాటు అంబరాన్నంటేలా వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం తొలిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్నదానాలు, అనాథ ఆశ్రమాల్లో, పేదలు, రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఖమ్మం జడ్పీచైర్మన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. నేడు అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర సాధకుడు, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో జన్మించడం రాష్ట్ర ప్రజల అదృష్టమని వక్తలు పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న ఆయన.. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, మంత్రి అజయ్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించారు.
తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తదేక దీక్షతో తన శక్తియుక్తులన్నీ ధారపోసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ‘తెలంగాణ గాంధీ’గా ప్రజలందరి నుంచి జేజేలు అందుకుంటున్నారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మూడు రోజులపాటు జరగనున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించారు. అక్కడి అనారోగ్య బాధితులకు పాలు, పండ్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ర్టాన్ని ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. అంతకన్నా మిన్నగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు తపిస్తున్నారని, శ్రమిస్తున్నారని చెప్పారు. విభిన్న, వినూత్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ర్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని అన్నారు. ఆయన జన్మదిన వేడుకలను పండుగలాగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాలు-సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు వనమా రామకృష్ణ, కొత్వాల శ్రీనివాసరావు, దామోదర్ యాదవ్, భూక్యా రాంబాబు, మండె వీరహన్మంతరావు, బరపటి వాసుదేవరావు, బదావత్ శాంతి, పరంజ్యోతిరావు, రుక్మాంగదర్ బండారి, బాలిశెట్టి సత్యభామ, కోలాపూరి ధర్మరాజు, పరమేష్ యాదవ్, బండి నరసింహ, అంబుల వేణు, మోరె రూప, కొల్లు పద్మ పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పూజలు చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. అనాథాశ్రమంలో అన్నదానాన్ని ప్రారంభించారు. సర్పంచ్ విజయ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ మెంబర్ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడి సరసవ్వతి, పెద్దమ్మ గుడి చైర్మన్ మహీపతి రామలింగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 15: టీబీజీకేఎస్ కార్పొరేట్ కార్యాలయంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేక్ కట్ చేశారు. నాయకులు ముప్పాని సోమిరెడ్డి, ఎండీ రజాక్, జేబీ మోహన్, సుధాకర్‌రెడ్డి, వలస కుమార్, మధుసూధన్‌రావు, కేఆర్ఎల్ రెడ్డి, జాన్సన్ సుధాకర్, కిరణ్, కొత్త శ్రీను, ఆర్.రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు, విప్లవ్‌రెడ్డి, నాగరాజు, రఘు, వెంకటేశ్వర్లు, ముత్తయ్య, జీవన్, రవి, నిరంజన్, శంకర్, ఐలయ్య, సికామణి పాల్గొన్నారు.