
మణుగూరు రూరల్, అక్టోబర్ 19 : సింగరేణి చరిత్రలోనే ఏ కార్మిక సంఘం చేయలేని సంక్షేమ, అభివృద్ధి, నూతన హక్కులను సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో సాధించిందని టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం కేపీయూజీ మైన్‌లో జరిగిన గేట్ మీటింగ్‌కు ఆయన హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికులంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని గౌరవమన్నారు. నూతనంగా విధుల్లో చేరిన బదిలీ కార్మికులు 190 మస్టర్లు పూర్తి చేసిన వారిని వెంట నే రెగ్యులరైజ్ చేసి జనరల్ మజ్దూర్ ప్రమోషన్ అందిస్తున్నది టీబీజీకేఎస్ అని గుర్తుచేశారు. ఇతర కార్మిక సంఘాలు గుర్తింపు సంఘాలుగా ఉన్నప్పుడు బదిలీ కార్మికులను పర్మినెంట్ చేయడానికే దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టిందన్నారు. తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, ఏసీ సౌకర్యం, ఉన్నత చదువులు, ఫీజు రీయింబర్స్మెంట్ యా జమాన్యమే చెల్లించడం, అంబేద్కర్ జయంతి రోజు వేతనంతో కూడిన సెలవుదినం, మహిళా ఉద్యోగులకు వెటర్నరీ లీవు, గృహ రుణంపై వడ్డీమాఫీ వంటి ఎన్నో హామీలు టీబీజీకేఎస్ నిలుపుకున్నదన్నారు. ఐఎన్టీయూసీ, ఇతర జాతీయ సంఘాలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం 18 ఏండ్ల క్రితం ఆనాటి చంద్రబాబు నాయుడు ప్ర భుత్వంతో కుమ్మక్కై వారసత్వ ఉద్యోగాలు బొందపెట్టడమే గాక అనేక కార్మిక హక్కులను హరించివేశారని గుర్తు చేశారు. పిట్ సెక్రటరీ నాగెల్లి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాయకులు వీరభద్రయ్య,శ్రీనివాసరావు, జైలాలుద్దీన్, పాండు రంగయ్య, గంగారాం వెంకటేశ్వర్లు, భాస్కరరావు, శ్రీనివాస్, హరికృష్ణ, సత్యనారాయణ, ప్రవీణ్, నాగేశ్వరరావు, పవన్, రాజేశ్ ఉన్నారు.
ఏసీ సౌకర్యం కల్పించండి
మణుగూరు ఏరియాలోని కమ్యూనిటీ హాల్‌కు ఏసీ సౌకర్యంతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఏరియా జీఎం కార్యాలయంలో చంద్రశేఖర్ డైరెక్టర్(ఆపరేషన్స్), ఏరియా జీఎం జక్కం రమేశ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియా దవాఖానలో గైనకాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు, అనస్తీషియా వైద్యులను నియమించాలని కోరడంతో పాటు ఏరియాలో కార్మికులకు పూర్తిస్థాయిలో జిమ్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. ఓపెన్‌కాస్ట్ గనులు, డిపార్ట్మెంట్లలో నెలకొన్న సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. నాయకులు వీరభద్రయ్య, కోట శ్రీనివాసరావు, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, బానోత్ కృష్ణ, వర్మ, కాపా శివాజీ, బుర్ర వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.