మధిర, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తున్న దని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర మండలం మాటూరుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు జనమే బలం, బలగమని పేర్కొన్నారు. కులమతాల చిచ్చుపెడుతున్న బీజేపీ వైఖరిని గ్రామాల్లో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
సీఎం కేసీఆర్‌కు బలమైనా, బలగమైనా ప్రజలు, కార్యకర్తలేనంటూ బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల్లో కులమతాల చిచ్చుపెట్టే బీజేపీ వైఖరిని గ్రామాల్లో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మండలంలోని మాటూరుపేట గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయానికి పెడుతోందని విమర్శించారు. ప్రధాని మోదీ రాష్ర్టానికి వచ్చి అన్ని అబద్దాలే చెప్పారని, ఆ విషయాన్ని ప్రజలు గమనించారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో అభివృద్ధికి సాధ్యమైందని అన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రజలు మరోసారి కేసీఆర్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని డిసెంబర్ 31 వరకు చెప్పిన బీఆర్ఎస్ బహిష్కృత నేతలు ఇప్పుడు అభివృద్ధి చెందలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. జోడో యాత్రలో తిరుగుతున్న మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బొమ్మెర రామ్మూర్తి, మెండెం లలిత, గుర్రం రామారావు, రావూరి శివనాగకుమారి, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, శీలం వెంకటరెడ్డి, చావా రామకృష్ణ, తాళ్లూరి హరీశ్, వంకాయలపాటి నాగేశ్వరరావు, చిత్తారు సింహాద్రి, కృష్ణారెడ్డి, బోగ్యం ఇందిర, మొండితోక దయాకర్, కోన నరేందర్‌రెడ్డి, అబ్బూరి పవన్, పాండురంగారావు, మేడిశెట్టి లీలావతి, అడపా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.