ఖమ్మం, జనవరి 25 : ఓటరు నమోదు అధికారి క్యాటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ప్రశంసాపత్రం అందుకున్నారు. 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై కమిషనర్ ఆదర్శ్ సురభికి గురువారం ప్రశంసాపత్రం అందజేశారు.