ఖమ్మం రూరల్ 25: పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత సత్యనారాయణపురంలో గొనే నాగిరెడ్డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. మండల కార్యాలయంలో ఎంపీ పాలెం పీహెచ్సీ పరిధిలోని ఆశ కార్యకర్తలకు స్మార్టుఫోన్లు, మండల సమాఖ్య భవనానికి సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. అనంతరం దానవాయిగూడెంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆరెకోడు గ్రామంలో ఇటీవల కాలువలో పడి మృతిచెందిన దంపతుల ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆరెకోడు గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తెల్లార్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందాళ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమ, జడ్పీటీసీ ప్రసాద్, టీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.