రాజన్న సిరిసిల్ల, జూన్14 (నమస్తే తెలంగాణ): పాలకవర్గ పదవీకాలం గడువు ము గుస్తున్నా.. అధికారుల తీరు మాత్రం మార డం లేదంటూ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. తాము ప్రతినిధ్యం వహిస్తున్న మండలాల్లో తమకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహించడంలో అంత్యరమేమిటని నిలదీశారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోయినపల్లి ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడారు. ప్రభు త్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పనులు చేస్తున్నారని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరును తాను ఇప్పుడే వింటున్నానన్నారు.
కొత్త పథకం వస్తే కనీసం ప్రజాప్రతినిధులకు సమాచారం కూడా ఇవ్వరా అని ప్రశ్నించా రు. ఆర్అండ్బీ ఏఈ కోసం మండల పరిష త్ కార్యాలయంలో ఓ గది కూడా కేటాయించినా ఇప్పటి వరకు ఏఈ ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. బోయినపల్లి మండలంలోని కొదురుపాక నుంచి ఒడ్యా రం వరకు నాలుగు వరుసల రోడ్డు పనులు నడుస్తున్నాయని, ఆ పనులను చూసే అధికారి ఎవరో కూడా తెలియకుంటే మండల పరిషత్‌లు ఎందుకని నిలదీశారు. మండల పరిషత్‌లు తీసేసి జిల్లా పరిషత్, గ్రామ పం చాయతీలే కొనసాగించుకోవాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్‌క్వాస్ సర్టిఫికెట్ వస్తే కూడా తమకు సచారం ఇవ్వలేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారిపై మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే తమకు సమాచారం ఇవ్వమని.. ఐదేండ్ల నుంచి ప్రతి మీటింగ్‌లో చెపుతున్నా అధికారులు తీరు మాత్రం మారడం లేదంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఇల్లంతకుంట నుంచి సిద్దిపేట వరకు నాలుగు వరుసలు, జిల్లెల్ల నుంచి ఇల్లంతకుంట వరకు మంజూరైన రోడ్ల పనులను ఎందుకు నిలిపివేశారంటూ జడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు ప్రశ్నించారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున కొన్ని కార్యక్రమాలకు సమాచారం ఇవ్వలేకపోయామని జడ్పీసీఈవో ఉమారాణి సమాధానం చెప్పారు. ఇల్లంతకుంట ఎంపీపీ మా ట్లాడుతూ, మిషన్ భగీరథ పనులు చూసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్యాంకులు కూడా సరిగా నింపడం లేదని, ఇంటింటికీ నీరందడం లేదన్నారు. కాలిపోయిన మోటార్లకు, పంపుసెట్ల మరమ్మతులకు పెట్టుబడి ఎవరు పెడుతారని ప్రశ్నించారు. పంచాయతీలలో నిధులు లేవ ని, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించా రు. వానలు కురుస్తున్నందున రైతులకు వ్య వసాయాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను కోరారు. పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని డీపీవోకు సూ చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఎఫ్‌వో బాలమణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు.