MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక కొత్త బస్టాండు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహనికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యంగ హక్కులపై ప్రజా ప్రతినిదులు అవగాహన కలిగి ఉండాలన్నారు.
సామన్యుల కోసం అంబేద్కర్ అందించిన రాజ్యంగ హక్కులు దుర్వినియోగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం కొనసాగించడం అంటే కుల రహిత, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమేనని తెలిపారు. విద్య, స్వయం ఉపాధి, చట్టపరమైన హక్కుల ద్వారా దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే అంబేద్కర్ కు మనం అందించే ఘన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోరుట్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.
పట్టణంలోని ప్రభుత్వ భూముల పరి రక్షణకు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత, ఉపాధ్యక్షుడు మహ్మద్ షాహిద్, కమిషనర్ రవీందర్, తహసీల్దార్ కృష్ణ చైతన్య, కౌన్సిలర్లు, అంబెద్కర్ సంఘాల ప్రతినిదులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.