BRS | హుజురాబాద్, ఏప్రిల్ 18: జమ్మికుంట 22వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద రాజేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కనకం రత్నాకర్ శుక్రవారం బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకనే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, వార్డ్ నాయకులు నాయకులు ఎర్ర సతీష్, ఎండీ సల్మాన్, ఎర్ర వంశీ, వడ్డూరి శశి, అంబాల అరుణ్, కనకం హరీష్, వంతడుపుల రేమో, చింటూ తదితరులు పాల్గొన్నారు.