కొత్తపల్లి/ విద్యానగర్/ కోర్టుచౌరస్తా/ కరీంనగర్ రూరల్, జూన్ 21 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. వేడుకల్లో ప్రముఖులు, వాకర్స్, యోగా సాధకులు, యువత, పిల్లలు పాల్గొనగా, యోగా గురువులు యోగా ప్రాముఖ్యతను వివరించి, ఆసనాలు వేయించారు. నగరంలోని జ్యోతినగర్‌లో గల ఓ పాఠశాల మైదానంలో నిర్వహించిన యోగా వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, నాయకులు హాజరై యోగాసనాలు వేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, భారతదేశం ‘యోగా భూమి’ అని ప్రపంచ దేశాలన్నీ గుర్తింపు ఇచ్చాయన్నారు. యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, నగరంలోని టీటీడీ కల్యాణ మండపం, కేఈఎస్ గార్డెన్, పద్మనాయక కల్యాణ మండపం, సుమంగళి గార్డెన్, శివాలయం యోగా సెంటర్, అలాపురి కాలనీ యోగా సెంటర్లో యోగా గురువులు, సాధకులు యోగాసనాలు వేశారు.
అలాగే, క్రీడా పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. యోగాలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించారు. ఈ వేడుకల్లో జిల్లా క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకలకు జిల్లా జడ్జి శివకుమార్ హాజరై మాట్లాడారు. ప్రతి ఒకరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడిగా న్యాయవాది మారోజు రామకృష్ణ చారి వ్యవహరించగా, న్యాయమూర్తులు సంతోష్‌కుమార్, నీరజ, పావని, చిరాగ్ మెహతా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బండ శివకుమార్, బొడ్ల గీతారాణి, ప్రధాన కార్యదర్శి చంద్రపాటి కిరణ్ కుమార్, బొజ్జ స్వామి, బెజ్జంకి శ్రీకాంత్, అనురాధ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే, స్థానిక మెడికవర్ దవాఖానలో వైద్యులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ లోకేష్, ఆచార్య రామకృష్ణ గౌడ్, మారెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, హెచ్ఆర్ ఈశ్వర్, దాసరి చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో యోగా గురువులు నాగమల్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బంది, వైద్య విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువులు నాగమల్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ ఇజ్రాయిల్, సీఏవో రాంచందర్‌రావు, డాక్టర్ ప్రణయ్, శ్రీకాంత్, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. సీతారాంపూర్‌లోని ఐవీవై, సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ సహకారంతో యోగా దినోత్సవం, ఫాదర్స్ డే నిర్వహించారు. ఈ వేడుకలను పాఠశాల వ్యవస్థాపకుడు పసుల మహేశ్, కో-చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్లు పసుల జయశ్రీ, స్వప్న, ప్రిన్సిపాల్ లలిత, ఇషా ఫౌండేషన్ గురుకులానికి చెందిన హాఠ యోగా శిక్షకులు పృథ్వీ, ప్రణవి ఓంకారం ప్రారంభించారు.
ఐవీవై విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పసుల మహేశ్, కో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతి రోజూ యోగా చేస్తే శరీరం దృఢంగా మారి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన విద్యార్థులే రేపటి శక్తిమంతమైన భారతదేశానికి పునాదులని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫాదర్స్ డే సందర్భంగా విద్యార్థుల తండ్రుల కోసం పాఠశాల యాజమాన్యం పలు వినోదాత్మక, సృజనాత్మకత ఆటలపోటీలు నిర్వహించగా ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు పాఠశాల చైర్మన్ జ్ఞాపికలు అందజేసి అభినందించారు. శాతవాహన యూనివర్సిటీలో శాతవాహన వాకర్స్, యోగా టీం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నర్సింగం హాజరై మాట్లాడారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పర్వతాల మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, యోగా మాస్టర్ కోల పోచాలు పటేల్, దుర్గం అంజయ్య గౌడ్, కనకాచారి, తిరునగిరి రవీందర్, అందె శ్యాంసుందర్, ఉట్ల దేవయ్య, ధర్మారం వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ మల్లేశం, లక్ష్మారెడ్డి, యోగా సాధకులు పాల్గొన్నారు.
శంకరపట్నం, జూన్ 21: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో యోగా డే ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మొలంగూర్ సర్పంచ్ రాజు, కేశవపట్నం ఉప సర్పంచ్ విజయ్‌కుమార్, వాకర్స్ అసోసియషన్ అధ్యక్షుడు వంగోజు సంపత్, మాజీ ఎంపీటీసీ ఎనుగుల అనిల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, హెల్త్ సూపర్వైజర్ అనిల్‌కుమార్, ఆదర్శ యూత్ క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.