Yoga Day | జగిత్యాల జూన్ 21 : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,(స్వయం ప్రతిపత్తి) జగిత్యాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా టీచర్ సంతోష్ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి విద్యార్థులకు యోగా గొప్పతనాన్ని వివరించారు.
విద్యార్థులతో ఆసనాలను వేయించి, వాటి యొక్క ప్రాముఖ్యతను, నిజ జీవితంలో వాటిని ఎలా అలవాటు చేసుకోవాలి అనే అంశాలను వివరించారు. నేటి ఆధునిక కాలంలో ఉరుకులు, పరుగుల జీవితంలో విద్యార్థులు అనేక రకాల ఒత్తిడిలకు గురౌతున్నారు. కనుక వాటన్నింటినీ తగ్గించుకోవడానికి యోగాను నిజజీవితంలో అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామకృష్ణ, ఎన్ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ శ్రీలత, సుజాత , హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్ నీరజ అధ్యాపకులు ప్రమోద్ కుమార్ , వరప్రసాద్, మల్లికార్జున్, వాసవి , రామ్ చందర్, జమున, జోష్న, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.