Yadavas | సారంగాపూర్, మే 12: యాదవులందరం ఏకమైతేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో యాదవ సంఘ భవనంలో సంఘ సభ్యులతో సమామేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాదవులందరం ఏకమైతేనే జనాభా ప్రాతి పాదికన న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు.
ఈ సందర్భంగా సంఘ సభ్యత్వ నమోదు నిర్వహించి సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం జనాభా ప్రాతి పదికన యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు సమావేశంలో చర్చించారు. కోనాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం మంది సభ్యత్వం తీసుకోగా వారికి ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులను అందించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అడహాక్ కమిటీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పన్నాల హరీష్, సారంగాపూర్ మండల ఇంచార్జి గా చెంది కొమురయ్యను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అడహాక్ కమిటీ జిల్లా కార్యవర్గ సభ్యులు యాదవనేని రాజలింగం, రెబ్బాస్ మల్లయ్య, చిర్రం గంగన్న, కోనాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు ఆర్దవేణి భీమయ్య, చెంది చిన్న కొమురయ్య, గంగాధర్, మల్లయ్య, మ్యాకల మల్లయ్య, ఎక్కలదేవి గంగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.