Yadava community | కాల్వశ్రీరాంపూర్, జూన్ 30 : ఇందిరా పార్కు వద్ద జరిగే యాదవ్‌ల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపు మేరకు పలువురు హైదరాబాద్‌కి బయలుదేరి వెళ్తున్నారు.
ఈ క్రమంలో యాదవ విద్యార్థి సంఘం నాయకులు కూకట్ల నవీన్ యాదవ్ తోపాటు తొట్ల భిక్షపతి, క్షణవేన కుమార్ ను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భంధించినట్లు వారి పేర్కొన్నారు.