Hypertension Day | సుల్తానాబాద్ రూరల్, మే 17: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు గర్రెపల్లి పిహెచ్ సి వైద్యులతో పాటు సిబ్బంది, గ్రామస్తులు కలిసి గ్రామ పురవీధుల గుండా శనివారం రాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పీహెచ్ సి వైద్యాధికారి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రా లను ప్రజలకు వివరించారు. అధిక రక్తపోటు నివారణకు ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ఉప్పు తగ్గించుకోవడంతో పాటు వ్యాయాం, యోగా మొదలగు వాటిపై ప్రజలు దృష్టి సాధించాలన్నారు. ప్రస్తుత సమాజం లో ఎక్కువ మంది పని ఒత్తిడి వలన అధిక రక్త పోటు కు గురి అవుతున్నారని పేర్కొన్నారు. అధిక బీపీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్స్, ఏఎన్ఎంలు,. సిబ్బంది. ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.