Peddapally | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 25 : పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాపిడ్ స్కిల్ సంస్థ రిసోర్స్ పర్సన్ అమన్ ఎలుగం మాట్లాడుతూ.. కళాశాలలో అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించినట్లు కొనియాడారు.
ఇలాంటి సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం వల్ల భవిష్యత్ చాలా అత్యున్నతంగా ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా కళాశాల చైర్మన్ ఏ నవీన్ కుమార్, డైరెక్టర్ నవత మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు, మండలాల వారికి ప్రయోజనకరంగా ఉండేలా కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు అందుబాటులోకి తెచ్చామని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీ శ్రీనివాస్, అకౌంట్స్ ఆఫీసర్ పీ పవన్ కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కే వెంకటేశ్వర్లు, డాక్టర్ వీ శ్రీధర్, అనిల్, శశికాంత్, రమ్య, వినోద, శరణ్య తదితరులు పాల్గొన్నారు.