కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 17: మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులు డి మాండ్ చేశారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన వరర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి దవాఖాన ఎదుట ధర్నా చేశారు. కా ర్మికులు అంటేనే అధికారులు, ప్రభుత్వానికి చిన్నచూపు అని మండిపడ్డారు. మూడు నె లలు జీతాలు ఇవ్వకుంటే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు.
చేసిన పనికి జీతం ఇవ్వాలని అడిగితే అధికారులు బెదిరిస్తున్నారని వాపోయారు. ఇతర కూలీలతో పని చేపిస్తామంటూ బెదిరిస్తున్నారని.. వారికి ఇచ్చే డబ్బేదో తమకు సకాలంలో ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. పెండింగ్ జీతాలు వచ్చేదాకా విధులు బహిషరిస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాలతోపాటు ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖ ర్ మాట్లాడుతూ, కార్మికుల పెండింగ్ వేతనాల కోసం డీఎంఈ హైదరాబాద్ వారు రిలీజ్ చేసిన రూ.3కోట్లు చెక్ ఇంకా పెండింగ్లో ఉండడమేంటని ప్రశ్నించారు. పది శా తం కమీషన్ ఇస్తేనే రిలీజ్ చేస్తారా..? అని ప్రశ్నించారు. అట్లయితే కార్మికులందరం కలిసి బిచ్చమెత్తి ఇస్తామన్నారు.
పెండింగ్ జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఇస్తేనే వారం క్రితం సమ్మె విరమించామని.. అయినా జీతాలు ఇవ్వడంలో అధికారులు విఫలం అయ్యారని విమర్శించారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, రెండు జతల బ ట్టలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమం గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పీ అరుణ్, టీ కళావతి, నాయకులు సుమన్, మహేశ్, మౌనిక, రాజయ్య, రజిత, అరుణ పాల్గొన్నారు.