Pegadapalle | కాల్వశ్రీరాంపూర్, జనవరి 16 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి హుస్సేన్ మియా వాగు ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ పెగడపల్లి గ్రామంలోని హుస్సేన్ మియా వాగు ఒడ్డున గత 45 సంవత్సరాల నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని, ఈనెల 28,29, 30 తేదీల్లో నిర్వహించే బోయే సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్తు, నీరు, బస్సు రోడ్డు సౌకర్యం తదితర ఏర్పాట్లు చేస్తామన్నారు.పెద్దరాతపల్లి, మీర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లే రహదారులకు పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రెండు కోట్ల 50 లక్షల నిధులు వేచించి బీటి రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే సమ్మక్క సారక్క జాతర వరకు పెగడపల్లి ఎస్సీ కాలనీ నుండి సమ్మక్క గద్దల మీదుగా మంగపేట బిటి రోడ్డు వరకు ఎమ్మెల్యే బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేపిస్తునట్ల వారు తెలిపారు. సమ్మక్క సారక్క జాతర వచ్చే తెలిపారు. భక్తులకు కోసం రహదారుల నిర్మాణం చేస్తున్న ఎమ్మెల్యే కు ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పత్తి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నాయకులు, కొండా శ్రీనివాస్ , గోడుగు రాజకొంరయ్య, సుమకం మల్లారెడ్డి, చలిగంటి రాంచంద్రం, అయిత శ్రీనివాస్, ఈర్ల శ్రీనివాస్, పెంట రాజేశం వీరగోని సదయ్య తదితరులు ఉన్నారు.