గన్నేరువరం,జనవరి3: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గన్నేరువరం వీవోఏగా పుష్పలతను తొలగించడం అన్యాయమంటూ మహిళా సంఘాల సభ్యులు మండల కేంద్రంలోని గ్రామ మహిళా సమైక్య భవనం ఎదుట ధర్నా(Womens protest) చేపట్టారు. గన్నేరువరానికి చెందిన మీసం పుష్పలత హరిప్రియ గ్రామ సమైక్య అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే పుష్పలత ఈనెల 22వ తేదీన గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో తన వ్యక్తిగత ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా తన పేరు రాలేదని ఆవేదనతో అధికారులతో మాట్లాడిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొందరు ఆమెపై కక్షగట్టి ఆమెను విధుల నుంచి తొలగింరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 సంవత్సరం నుంచి హరిప్రియ సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
కొంతమంది అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆమెను బలి చేశారని మండిపడ్డారు. పుష్పలతను మళ్లీ విధుల్లోకి తీసుకోకుంటే ధర్నాలు చేస్తామని, హరిప్రియ సంఘం నుంచి తమ అందరం వెళ్లిపోతామని మహిళలుహెచ్చరించారు. ఈ విషయంపై ఐకెపి ఎపిఎం లావణ్య వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ.. 22వ తేదీన గన్నేరువరం గ్రామసభలో ఆందోళన చేపట్టిందని తెలిపారు. ఆమెపై అధికారులకు సమాచారం వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు గ్రామ సమైక్య సమావేశం నిర్వహించి తీర్మానం చేపట్టి తొలగించామన్నారు.