Collector Koya Sri Harsha | పెద్దపల్లి, నవంబర్14: జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సెర్ఫ్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సంఘాలు బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రతీ మహిళా సంఘం ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. స్త్రీ నిధి రుణాల పంపిణీలో పెద్దపల్లి జిల్లా రాష్ర్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఏపీఎం, డీపీఎంలను అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి గ్రామీణ అభివృద్ధి అధికారి నరేందర్, అదనపు డీఆర్డీవో రవీందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.