హుజూరాబాద్ టౌన్, మార్చి 7: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సోమవారం కేసీఆర్ మహిళా బంధు సంబురాలను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల వేడుకలకు ప్రజాప్రతినిధులు హాజరై వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలతోపాటు మహిళా అధికారులు, సిబ్బందిని సన్మానించారు. హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల కేక్ కట్ చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ జీ దుర్గాభవాని, వైద్యురాలు మారపెల్లి ప్రత్యూష, ఎన్జీసీ టీచర్ సానె అనురాధ, కవయిత్రి, రచయిత దివిటీ అంజనీదేవి, కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, మారెపల్లి సుశీల, కేసిరెడ్డి లావణ్య, గోవిందుల స్వప్న, పీ రాజకొమురమ్మ, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు బింగి సరస్వతి, ఆర్పీల అధ్యక్షురాలు శ్రీదేవి, సీఎల్ఆర్పీలు టీ రమాదేవి, కే స్వరూప, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ సీఐ జీ దుర్గాభవాని హాజరు కాగా, కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ శ్యామలాదేవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హుజూరాబాద్‌లోని 9వ అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు అంగన్వాడీ టీచర్ జ్యోతీరాణి ముగ్గుల పోటీలు నిర్వహించారు.
హుజూరాబాద్ రూరల్, మార్చి 7: మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో మహిళా బంధు సంబురాల్లో భాగంగా పలువురు గ్రామ మహిళలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచ్ పోరెడ్డి రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
సైదాపూర్, మార్చి 7: మహిళా బంధు సంబురాల్లో భాగంగా వెన్నంపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు బిల్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సింగిల్‌విండో పరిధిలోని గ్రామాలకు చెందిన ఆశ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, వీఏవోలు, అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి మహిళలను శాలువాలతో సత్కరించారు. లస్మన్నపల్లిలో సర్పంచ్ కాయిత రాములు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి పలువురు మహిళలను సన్మానించారు. సైదాపూర్‌లో సర్పంచ్ చంద శ్రీనివాస్, వెన్కేపల్లిలో సర్పంచ్ కొండ గణేశ్, ఎక్లాస్‌పూర్‌లో సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, దుద్దనపల్లిలో సర్పంచ్ తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు మహిళలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, కేడీసీసీ బ్యాంకు మేనేజర్ అశ్విని, ఏఈవో రజిత, సర్పంచులు అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, ఆవునూరి పాపయ్య, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
వీణవంక, మార్చి 7: మండల కేంద్రంలోని బుడిగ జంగాల కాలనీలో మహిళా బంధు సంబురాల్లో భాగంగా సోమవారం సుమారు 30 మంది మహిళలను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ ముసిపట్ల రేణుక, వైస్ ఎంపీపీ లత మహిళలకు బొట్టుపెట్టి, గాజులు అందజేసి, స్వీట్లు పంపిణీ చేయగా, మల్లారెడ్డిపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కాసం వీరారెడ్డి, కో ఆప్షన్‌మెంబర్ హమీద్, ఉపసర్పంచ్ వోరెం భానుచందర్, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్, నాయకులు మర్రి స్వామి, జీడి తిరుపతి, సంపత్‌రెడ్డి, దాసారపు శంకర్, నరేశ్, వార్డు మెంబర్ వోరెం సుమతి, దాసారపు మణెమ్మ, నీల బుచ్చి మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం పులి అశోక్‌రెడ్డి మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, మార్చి 7: మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. మహిళ బంధు సంబురాల్లో భాగంగా పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహిళా వైద్యులు, మహిళా ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా సిబ్బందిని వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, ఇతర కౌన్సిలర్లతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా కౌన్సిలర్లు సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలను కట్టారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, తహసీల్దార్ రాజ్, కమిషనర్ సుమన్‌రావు, మెప్మా ఏడీఎంసీ మల్లేశ్వరి, మహిళా వైద్యులు సావిత్రి, లావణ్య, పద్మజ, మౌనిక, రాణి, అనిత, మున్సిపల్ ఏఈ చంద్రకళ, ఏవో విమల, ఆర్ఐ వాణితోపాటు ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని అరుణోదయ మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన వేడుకలకు జడ్పీటీసీ శ్రీరాశ్యాం హాజరుకాగా, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు మొగిలి, సురేశ్, సరిత, శ్రీను, అనూష, మండల సమాఖ్య అధ్యక్షురాలు రజిత తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సుజాత అధ్యక్షతన జరిగిన వేడుకలకు ఇల్లందకుంట తహసీల్దార్ సురేఖ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సువర్ణ, శ్రీలత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.