కార్పొరేషన్, నవంబర్ 1: కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో నగరంలోని పలు డివిజన్లకు చెందిన మహిళలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే, నగరానికి చెందిన 30 మందికి పైగా యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్తోనే యువతకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే ఈ స్థాయిలో అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తప్పు చేస్తే యువత భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తప్పుడు ప్రచారాలను నమ్మితే తెలంగాణ మళ్లీ ఆంధ్రాలో కలిపి ఇక్కడి నీళ్లు, కరెంటు, హైదరాబాద్ సంపదను దోచుకుపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలిచి గెలిపించాలన్నారు. తనను మరోసారి గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేసి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వనజ, లక్ష్మి, అమర్, సంజీవ్, అనంద్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ ఉపసర్పంచ్ ఇస్తియాక్ అహ్మద్ బుధవారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. స్థానిక రజ్వీచమన్లోని ఎస్ఎఫ్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు ముస్లిం యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలోనే మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జమీలొద్దీన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 1: పల్లెల్లో జరిగిన అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగునూర్ గ్రామంలో మున్నూరుకాపు, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యమంలో అత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఎంపీటీసీలు వినయ్, శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ సాయిల మహేందర్, పిట్టల రవీందర్, పప్పు లచ్చయ్య, సొసైటీ అధ్యక్షుడు నూనె రాజేశం, మల్లేశం, రాజు, కొమురయ్య, తాటికొండ మధుకర్, మున్నూరుకాపు సంఘం నాయకులు వరి భద్రయ్య, తోట సత్యనారాయణ, మామిడి అదిరెడ్డి, సంజీవ్, వరి శంకరయ్య, కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, నెక్పాషా, బాబు, పెంచాల శ్రీనివాస్‌రావు, రవితేజ, లక్ష్మారెడ్డి, శ్రావన్, శ్రీనివాస్, రవి, తదితరులు పాల్గొన్నారు.