సకల వసతుల సర్కారు బళ్లు.. ‘మన ఊరు మన బడి’తో మారిన రూపురేఖలు
మన ఊరు మన బడి కా ర్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రామన్నపేట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సర్వాంగ సుందరంగా త యారయ్యాయి. సకల సౌకర్యాలు కల్పించుకొని కార్పొరేట్‌కు దీటుగా రూపుదిద్దుకున్నాయి. మన ఊరు మనబడి మొదటి విడుతలో రెండు పాఠశాలలు ఎంపిక కాగా అన్ని వసతులు కల్పించారు.
- ‘మన ఊరు మన బడి’తో మారిన రూపురేఖలు
- కార్పొరేట్‌కు దీటుగా రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలు
- స్కూళ్లలో అన్ని వసతుల కల్పన
- టీ-సాట్ నేతృత్వంలో డిజిటల్ పాఠ్యాంశాల భోధన
మల్యాల, జూలై 3: మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రామన్నపేట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సర్వాంగ సుందరంగా త యారయ్యాయి. సకల సౌకర్యాలు కల్పించుకొని కార్పొరేట్‌కు దీటుగా రూపుదిద్దుకున్నాయి. మన ఊరు మనబడి మొదటి విడుతలో రెండు పాఠశాలలు ఎంపిక కాగా అన్ని వసతులు కల్పించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యుద్దీకరణ కోసం రూ.85,428, తాగునీటి వసతి ఏర్పాటు కోసం రూ.37,177, పలు మరమ్మత్తుల పనుల కోసం రూ.2,42,713 వెచ్చించారు. బాలబాలికలకు వేర్వేరుగా రూ.3,50,000తో టాయిలెట్స్ నిర్మించారు. సీపీఎం గ్రాంట్ కింద గ్రీన్‌చార్ట్ బో ర్డులు, డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. పాఠశాలకు అందమైన రంగులు వేయించారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యుద్దీకరణ కో సం రూ.2,42,751, తాగునీటి వసతి కోసం రూ.1,57,817, బాలబాలికలకు వేర్వేరుగా టా యిలెట్స్ కోసం రూ.7లక్షలు, ప్రహరీ నిర్మాణానికి రూ.13 లక్షలు వెచ్చించారు. రూ.1.20 లక్షలతో గ్రీన్‌బోర్డులు, రూ.13 లక్షలతో డ్యూయల్ డెస్క్ లు, డిజిటల్ క్లాస్ రూంల నిర్వహణకు ప్రొజెక్టర్ కమ్ స్క్రీన్, వంటగది, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో ఫర్నీచర్ అందజేయడంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి.

డిజిటల్ తరగతులు
విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేయడంతో పాటూ రెండు జతల యూనిఫాంలను ప్ర భుత్వపరంగా పాఠశాలలో అందజేస్తున్నారు. మన ఊరు మన బడితో పాఠశాల సుందరీకరణ అవడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టడంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాఠశాలలోని డిజిటల్ పాఠ్యాంశాల తరగతి గదులను ఇటీవలే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలంగాణ విద్యాదినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రారంభించారు. సర్పంచ్ గడ్డం జలజ- మల్లారెడ్డి దంపతులు ఆలయంలో సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. సువిశాలమైన ప్రాంగణం, టీసాట్ ద్వారా ఆన్లైన్ క్లాస్‌ల నిర్వహణ, ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన, ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు ఉండడంతోపాటు బాలికలకు హైజెనిక్ కిట్లను సైతం అందిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం మొగ్గు చూపుతున్నారు.
కనీస సౌకర్యాలు లేక సమస్యలతో కొట్టుమిట్టాడిన రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం సకల వసతులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల తన స్వరూపానే మార్చుకున్నాయి. అధునాతన టాయిలెట్స్, విశాలమైన వంట గది, తరగతి గదిలో డ్యూయల్ డెస్క్‌లు, గ్రీన్ బోర్డులు, డిజిటల్ క్లాస్ రూంలు. ఇలా సకల వసతులు కల్పించుకొని కార్పొరేట్‌కు దీటుగా తయారయ్యాయి.
– మల్యాల, జూలై 3
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

