Aidwa | రా జన్నసిరిసిల్ల, కలెక్టరేట్, జూలై 2 : రద్దీప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో మదుబాబులు రోడ్లపైనే వెహికిల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బదులకు గురికావాల్సి వస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజి విమల మండిపడ్డారు. సిరిసిల్లలోని అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంరద్దీప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో మదుబాబులు రోడ్లపైనే వెహికిల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బదులకు గురికావాల్సి వస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజి విమల మండిపడ్డారు. సిరిసిల్లలోని అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. దర్భంగా విమల మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మెయిన్ రోడ్ల వెంబడి పాత బస్టాండ్, గాంధీ చౌక్, కొత్త బస్టాండ, చౌరస్తాలలో మద్యం షాపులు నిర్వహించడం వల్ల మద్యం కొనడానికి వచ్చేవారు రోడ్డుకిరువైపులా వెహికల్స్ పార్కింగ్ నిర్వహిస్తున్నారన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, మద్యం షాపులో పక్కనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, దీంతో ఆ ప్రాంతం నుండి వెళ్లే మహిళల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు.
ప్రభుత్వం మద్యం అమ్మడానికే ప్రాముఖ్యత ఇస్తుంది గాని ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు మద్యంపై వస్తున్న ఆదాయమే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. ప్రధాన రహదాల నుండి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు పెట్టాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొడం లలిత, ఆడెపు లావణ్య, పద్మ, విజయ, వడ్డేపల్లి లక్ష్మీ, కొడం అరుణ తదితరులు పాల్గొన్నారు