welfare of working journalists | పెద్దపల్లి, సెప్టెంబర్ 11: పెద్దపల్లి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నిలిస్టులకు విడుతల వారిగా ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.
స్థానిక రిక్రియేషన్ క్లబ్లో గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఎన్నికల నామినేషన్లు, ఉపసంహరణలు జరగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గుడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి గోపాల్, ఉపాధ్యక్షులుగా బెజ్జంకి నరేష్, తిర్రి తిరుపతి గౌడ్, కోశాధికారిగా ఆరెళ్ళి మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జంగిలి రాజు యాదవ్, సహాయ కార్యదర్శులుగా అర్కూట మల్లేష్ యాదవ్, కత్తెర్ల తిరుపతి యాదవ్ , అనకట్ల ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా మర్రి సతీష్ రెడ్డి, తిర్రి శంకర్, సంకె రాజు , నాగిశెట్టి శ్రీనివాస్, కొయ్యడ తిరుపతి, సాబీర్ పాషా,, తిర్రి సుధాకర్ గౌడ్, మాచర్ల వంశీక్రిష్ణ, నగునూరి శ్రీనివాస్, తూర్పాటి శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎర్రోజు వేణుగోపాల్, సహాయ అధికారులు బందెల రాజశేఖర్, తంగళ్ళపల్లి మధుసూధన్ వెల్లడించారు. ఈ మేరకు నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.