పెగడపల్లి : కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం అసమర్ధత పాలన వల్ల రాష్ట్రంలోని రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) అన్నారు. పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని ఇబ్బందులు రేవంత్ పాలనలో ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
కేసీఆర్ ( KCR ) నాయకత్వంలో నీళ్లు, 24 గంటల కరెంట్, పంట పెట్టుబడి, ఎరువులు సకాలంలో అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక అంతా ఆగిపోయిందని విమర్శిం చారు. ప్రభుత్వం సక్రమంగా, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం పంట కళ్లాలోనే కుప్పల, తెప్పలుగా పోసి ఉంటున్నాయని, వర్షాల భయంతో రైతులు అరచేతుల్లో ప్రాణం పెట్టుకుని లారీల కోసం ఎదురుచూపు చూస్తున్నారని తెలిపారు. అంతేగాక బస్తాకు 3.2 కేజీ కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
ధర్మపురి నియోజకవర్గ మంత్రి, కలెక్టర్, కాంగ్రెస్ నాయకులకు రైతుల పట్ల పట్టింపు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో రైతు డిక్లరేషన్ పేరుతో 36 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు .