Whip Laxman Kumar | ధర్మారం, మార్చి 29: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మసీదులో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
ముస్లిం సోదరుల ఉపవాసం దీక్ష ముసిన అనంతరం వారు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారితో కలిసి లక్ష్మణ్ కుమార్ ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండి బాబా, గౌరవ అధ్యక్షుడు ఎండి గౌస్ బాబా, మైనారిటీ నాయకులు ఎండి హుస్సేన్, ఎండి హఫీజ్, అబ్దుల్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.