హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 28 : హుజూరాబాద్ నియోజకవర్గంలో మంజూరు చేసిన దళితబంధు యూనిట్లపై దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చర్చకు రావాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఇతర నాయకులతో కలసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో దళితబంధు ఇవ్వలేదని ఎమ్మెల్యే ఈటల మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మేధా వి అని చెప్పుకునే ఈటల తెలివి ఎకడికి పోయిందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే లబ్ధిదారులను గుర్తించినట్టు 18 వేల 21 యూనిట్లను లబ్ధిదారులకు అందించామని చెప్పా రు. అయినా ఈటల మాత్రం 17,600 మందికి ఇచ్చారని, ఇంకా 3 వేల మందికి ఇవ్వాలని ఎలా చెబుతున్నారో ఆయనకే తెలువాలని, ఎంత మం దికి ఇచ్చామో ఎమ్మెల్యేగా ఆయనకు లెక్క తెలువక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఉప ఎన్నికలోనూ దళితబంధుపై అసత్యపు ప్రచారం చేశారని, దళితబంధు ఇచ్చినా ఇవ్వలేదని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను మందలించినట్లు ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంపై ఆధారాలు చూపిస్తే ముకు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఇంకా దళితబంధు ప్రక్రియ కొనసాగుతుందని, దరఖా స్తు చేసుకున్న కొంత మందికి వచ్చాయని, త్వర లో వాటిని ప్రారంభిస్తామన్నారు. రాని వారు స్వ యంగా తనకు దరఖాస్తు చేసుకోవాలని ప్రెస్‌మీట్ పెట్టి చెప్తే పలువురు వచ్చి ఇచ్చారని తెలిపారు. దళితులపై ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తున్నామని, బీజేపీ ఎమ్మెల్యేలకు ద మ్ముంటే కేంద్రం నుంచి మరో రూ.10 లక్షలు ఇ ప్పించాలని డిమాండ్ చేశారు. ఈటలపై ప్రజలు తిరగబడి తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వరరావు, సింగిల్ విండోల అధ్యక్షులు ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, మక్కపెల్లి కుమార్‌యాదవ్, సందమల్ల బాబు, మోరె మధు, వెంకటేశ్‌గౌడ్, బుర్ర కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.