వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో చెట్లన్నీ మోడువారి ఉంటాయి. ప్రకృతి రమణీయత దెబ్బతింటుంది. కానీ, దానికి భిన్నంగా ఈ వేసవిలో పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అకాల వర్షాలు కురవడంతో నట్టెండలోనూ చెట్లు పచ్చగా కళకళలాడుతున్నాయి.
02
రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంతో పాటు పచ్చికబయళ్లు సైతం ఇలా మే నెలలో ప్రకృతి రమణీయతను సంతరించుకొని బాటసారులకు ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తున్నాయి.
– సిరిసిల్ల, మే 4