
Peddapally | పాలకుర్తి : పాలకుర్తి మండలం వెంనూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా భక్తులు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమం నిర్వహించారు.
చివరిరోజు స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. కొండపై ఉన్న ఆలయంలో కల్యాణానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.