local body elections | ధర్మారం, అక్టోబర్ 6: త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ధర్మారం కేంద్రంలో పార్టీ మండల స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన పేర్కొన్నారు. మండలంలో ఎంపీపీ ,జడ్పిటిసి పదవులను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలంలో ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మేడవేణి శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్, గోనె సాయి కృష్ణ, వేల్పుల తిరుపతి, దేవి కొమురేష్, కొలిపాక మణికంఠ ,మామిడి చందు,, కర్రే లక్ష్మణ్ ,జంగిలి రాజయ్య, రేండ్ల శ్రీనివాస్, పల్లె లక్ష్మణ్, , రజనీకాంత్, గుమ్ముల తిరుపతి, బత్తుల కుమారు, కాల్వ కుమార్, రాజు ,దొంత రాజన్న మేడి రమేష్, అత్తిపత్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.