New substations | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 8: లో- ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం కోసం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లే లో శుక్రవారం ఉదయం వేళ లో పర్యటించారు.ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను కలిసి బాలమల్లుపల్లే, రామోజీపేట గ్రామస్తులు , రైతులు లో ఓల్టేజ్ కరెంట్ సమస్య తో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.
ఈ సందర్భంగా రామారావు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బాలముల్లు పల్లి, రామోజీపేట గ్రామాల మధ్య 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే తంగళ్ళపల్లి మండల కేంద్రంలో విద్యుత్ సబ్ డివిజన్ ఏర్పాటు చేశామని, మండలం లో మూడు సబ్ స్టేషన్ లు, నేరెళ్ల లో 123 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటి కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే , నిర్మాణాల చేయవచ్చన్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ అందిస్తామని పేర్కొన్నారు.ఆయన వెంట బాల మల్లు పల్లే రైతులు ఉన్నారు.