Kalvakuntla Vidyasagar Rao | జగిత్యాల, ఆగస్టు 10: అభివృద్ధి ముసుగులో అన్యాయం చేస్తే సహించబోమని, కూల్చిన నిరుపేదల ఇళ్లను తిరిగి కట్టించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్(మున్సిపాలిటీ)కు చెందిన నూకపల్లి డబుల్ బెడ్ రూం కాలనీని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, ఆ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం సందర్శించారు.
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ 2bhk లో ఉంటున్న నివాసితులు దోమలు, పాములు, తెలు, వీధి దీపాలు, మురుగు కాలువల సమస్యల గురుంచి ఏకరువు పెట్టారు. జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ సంబంధిత అధికారులు, మునిసిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, వారం రోజుల తర్వాత మళ్లీ వస్తామని, ఆలోపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో మంజూరై ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు కొంత బెస్మెంట్, లెంటల్ లెవెల్, స్లాబ్ లెవెల్ వరకు నిర్మించుకున్న వాటిని ఇటీవల తొలగించిన వాటిని ఆ లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి లబ్ధిదారులతో చర్చించి వెంటనే వారికి ఇంటి స్థలాలు, నిర్మాణానికి డబ్బులు లేదా 2bhk లో ఖాళీగా ఉన్న వాటిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దావ వసంత మాట్లాడుతూ కేసీఆర్, అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్, అప్పటి ఎంపీ కవిత సహకారంతో మంజూరైన 4500 2bhk ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇన్ని కోట్లు తెచ్చినం, అన్ని కోట్లు తెచ్చినం చెప్తున్నారని కానీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2bhk లబ్ధిదారులు కేసీఆర్ ని గుర్తుకు తెచ్చుకొని, మళ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, అవారి శివాకేసరి బాబు, సమిండ్ల వాణి శ్రీనివాస్, జగిత్యాల రూరల్ అధ్యక్షులు ఆయిల్నేని ఆనంద్ రావు, జగిత్యాల అర్బన్ అధ్యక్షులు తుమ్మ గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, జగిత్యాల అర్బన్ మాజీ జడ్పీటీసీ సంగెపు మహేష్ నాయకులు శీలం ప్రవీణ్, కమలాకర్ రావు మజాహిర్ రిజ్వాన్, నక్క గంగాధర్, గాజుల శ్రీనివాస్, గందే అనురాధ, రాజేందర్, నీలి ప్రతాప్, ప్రణయ్, భగవాన్, బాలే చందు మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.