Vijayaramanarao | ఓదెల, జూన్ 9 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఓదెల నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డి.ఎ.ఎఫ్.టీ ద్వారా రూ.12 కోట్ల 75 లక్షల నిధులతో డబల్ రోడ్డు పనులకు, ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నుండి డి 86 కెనల్ వరకు సి.సి రోడ్డు నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులతో అలాగే అంగన్వాడీ భవన నిర్మాణం కోసం ఎం.జి.ఎన్.ఆర్.ఈ. జి.ఎస్ నిధుల ద్వారా రూ.12 లక్షల నిధులతో శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నూతన నిర్మాణాలకు ముగ్గులు పోశారు . అనంతరం ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో రేషన్ షాపు ప్రారంభించిన అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఓదెల మండల కేంద్రం నుండి పెగడపల్లి వరకు రూ.12 కోట్ల 75 లక్షలతో డబల్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
ఓదెల నుండి మల్లికార్జున స్వామి దేవాలయం వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం కు రూ.10 కోట్లు నిధులు వెచ్చించి ఏర్పాటు చేస్తానన్నారు. కొమురె, భీమారం పల్లె మల్లికార్జున స్వామి దేవాలయం వరకు రూ.రెండు కోట్లతో ఫార్మేషన్ కూడా చేయడం జరిగిందన్నారు. రూ.రెండు కోట్లతో జీలకుంట, భీమరపల్లి, చిన్న కొమురే వరకు బీటీ రోడ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగిందని, త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు మానేరు నీరు త్రాగించేందుకు రూ.90 లక్షల నిధులతో రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా ప్రారంభిస్తామన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ నుంచి పోత్కపల్లి వరకు బీటీ రోడ్ రూ.25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని పనులు కూడా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గింజ కటింగు లేకుండా వరి ధాన్యం అమ్మిస్తానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఈ నియోజకవర్గంలో గింజ కటింగ్ లేకుండా వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు బోనస్ పడుతుందన్నారు. ఈ వారం రోజుల్లో ఈ వేసవిలో పండించిన సన్న వడ్లకు మన నియోజకవర్గంలో రూ.31 కోట్లు రైతుల ఖాతాలో జమ అయితాయి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు.
ఓదెల, పిట్టలఎల్లయ్యపల్లి గ్రామాలల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రేషన్ షాపులలో సన్న బియ్యం పేదలకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు దిగివచ్చి వారే సీడ్ వరి విత్తనాలు ఇవ్వడంతో పాటు కంపెనీ వారి హార్వెస్టింగ్ చేసి గతం లో ఉన్న ధర కంటే సుమారు రూ.1000 నుంచి రూ.2000 ఎక్కువ పెట్టి రైతుల వద్ద నుంచి సీడ్ వరి ధాన్యం తీసుకుంటున్నారని తెలిపారు. ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో నిధులు వెచ్చించి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవికుమార్, నాయకులు ఆకుల మహేందర్, బోడగుంట చిన్నస్వామి, చీకట్ల మొండయ్య, తీర్థాల వీరన్న, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, అల్లం సతీష్, వంగ రాయమల్లు, పిట్టల కొమురయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.