Journalists | రామగిరి జూలై 20 : జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే అర్హత కలిగిన ప్రతీ పాత్రికేయునికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు. రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్లో జిల్లా కార్యవర్గ మొదటి సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షుడు మల్ల వజుల వంశీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగునూరి శేఖర్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాత్రికేయుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ చెబుతున్న హామీలు ఆచరణ అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సానుకూల దృక్పథం పరిష్కరించే విధంగా త్వరితగతిన సమస్యల పరిష్కరించాలని అన్నారు. పాత్రికేయుల సమస్యలు రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పాత్రికేయులకు టోల్ గేట్ వద్ద వాహనాలకు ఎటువంటి రుసుము లేకుండా పంపించాలని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పాత్రికేయుల పిల్లలకు 50శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రతీ అక్రిడేషన్ గల జర్నలిస్టుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసేలా జీవోను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోల లక్ష్మన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.