Central government schemes | రుద్రంగి, జూలై 5: కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్ గిరిజనశాఖ ప్రోగ్రాం ఇన్చార్జి గీతాభవానీ అన్నారు. రుద్రంగి మండల దేగావత్ తండా గ్రామంలో బడితండా, రూప్లానాయక్ తండా, సర్పంచ్ తండా మూడు గ్రామాల గిరిజన ప్రజలతో పీఎం జన జాతీయ గ్రామ ఉత్కర్ వేడుకల్లో భాగంగా గిరిజనులకు ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్‌పై అధికారులు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గిరిజనులకు అందించే సబ్సిడీ పథకాలపై క్లుప్తంగా వివరించినట్లు చెప్పారు.
గిరిజనులకు ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక భద్రత, జన్ ధన్ యోజన ఖాతాలు, ఇందిర సౌర గిరి జల వికాసం, హర్టికల్చర్, సబ్సిడీ లోన్స్, మొక్కల పెంపకం, ఉపాధి పనులు, ఆయుష్మాన్ కార్డులు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా పరిశ్రమల అధికారి భారతీ, ఎంపీడీవో నటరాజతో పాటు గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు, మండల అధికారులు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.