Jagityal | జగిత్యాల, ఏప్రిల్ 6 : బీటీఆర్ స్ఫూర్తి తో కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. కార్మిక ఉద్యమ నాయకులు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదీవే 35వ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ బిటి రణదివే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా కో-కన్వీనర్ కోమటి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు. ఆయన స్ఫూర్తితో పోరాటాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బచ్చల వినోద్, మహ్మద్, సాగర్, భుపెల్లి రాజేష్, శివ, హరి, లక్ష్మణ్, నరేష్, గంగా స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.