Chinnakalvala | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 21 : సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు. చిన్న కల్వల పీఏసీఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకులో శుక్రవారం సర్వో ఆయిల్ ఇండియన్ ఐఓసీఎల్ చేపట్టారు.
ఆయిల్ అమ్మకాల లో భాగంగా 900 ఎంఎల్ ఆయిల్ కొనుగోలుతో 900 ఎంఎల్ పెట్రోల్ ఫ్రీ, డీజిల్ వాహనాల ఆయిల్ కొనుగోలుపై అదేవిధంగా డీజిల్ ఫ్రీ ఇవ్వనున్నట్లు కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ కంపెనీ సేల్స్ మెన్ రాజేశ్వరరావు, సంఘం సీఈవో వల్లకొండ రమేశ్, సిబ్బంది ఆకాష్, సంపత్, అంజి, శీను, ఓదెలు, వెంకన్న, పరశురాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు.