Bhagiratha maharshi | వీణవంక, మే 04: ప్రతీ ఒక్కరూ భగీరథడి అడుగుజాడల్లో నడవాలని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని శ్రీరాములపేట, కొత్తపల్లి, రెడ్డిపల్లి, వల్భాపూర్ గ్రామాల్లో ఆదివారం సగరుల కులగురువయిన భగీరథ మహర్షీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు దేవునూరీ శ్రీనివాస్ మాట్లాడుతూ సగరులు భగీరథుడి వలె కఠోర శ్రమ చేస్తున్నారని, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహర్షీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి, మండలాధ్యక్షుడు గుంటి అశోక్, నాయకులు దేవునూరి రాజేందర్, కురుమిండ్ల మల్లయ్య, దేవునూరి రఘు, జి.రాజయ్య, జి.తిరుపతి, బొడిపె ల్లి శ్రీనివాస్, బి.రవీందర్, పొడపత్రపు సారయ్య, గుంటి శ్రీనివాస్, కట్ట శ్రీనివాస్, కట్ట మల్లేష్, స్వామి, సమ్మయ్య, కుమారస్వామి, నలుబాల మధు, పున్నంచందర్ తో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.