Cyber crimes | పాలకుర్తి : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్సై స్వామి సూచించారు. మాదకద్రవ్యాల నిరోధకంపై తక్కళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా, గంజాయి, ఇతరత్రా మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్, సైబర్ ఫ్రాక్స్, ఇతరత్రా అంశాలపై విద్యార్థులు అప్రమంతంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులను ఎవరైనా తప్పు దోవపట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసంత్‌నగర్ పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.