Saraswati Pushkara flexi | మంథని, మే 15: కాళేశ్వరం లో గురువారం నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచె అన్నారు. సరస్వతీ నది పుష్కరాలు 2025 సందర్భంగా కాళేశ్వరం లో ఏర్పాటుచేసిన కటౌట్లలో ఏదేని పొరపాటు చోటు చేసుకున్నట్లయితే ఆ బాధ్యత వాటిని ఏర్పాటు చేసిన ప్రచార సంస్థదే తప్ప ప్రభుత్వ పెద్దలది కాదన్నారు.
దీనిని భూతద్దం లో చూపడం మంచిది కాదని, పొరపాటును సరిదిద్దమని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ అంశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారు హిందువుల మనోభావాలను దెబ్బతినేవిదంగా వ్యవహరించారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పోరపాటును సరిదిద్దు తుందని, ఈ పొరపాటుకు తాము కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.