Local elections | మల్లాపూర్, జూలై 7: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి మండలంలోని వేంపల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించుకోవాలని కోరారు.
అలాగే ఈ నెల 10న మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభ వేడుకలు, కార్యకర్తల సమావేశంను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున ఈ సమావేశానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నూతనంగా వేంపల్లి గ్రామశాఖ అధ్యక్షునిగా కల్లెడ గంగాధర్, వెంకట్రావుపేకు అరె పెద్దిరెడ్డిని ఏకగ్రీవంగా నియమించినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెటీ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, నాయకులు దేవ మల్లయ్య, కొమ్ముల జీవన్ రెడ్డి, ముద్దం శరత్ గౌడ్, మేకల సతీష్, న్యామతేబాద్ రాజు, బిట్ల నరేష్, మచ్చర్ల శ్రీనివాస్ రెడ్డి, దశరెడ్డి, తోట శ్రీనివాస్, మినుగు చంద్రశేఖర్, కొడిమ్యాల రవి, తదితరులు పాల్గొన్నారు.